Header Banner

తిరుమల మఠాల అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ వార్నింగ్! చర్యలు తీసుకోవాల్సిందే!

  Wed Mar 12, 2025 20:40        Others

తిరుమలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేసింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హెచ్చరించింది. ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. తిరుమలలో నిర్మాణాలను ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమలలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.


ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!


తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, తిరుమలలో ధార్మిక సంస్థలు, మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామన్నారు. తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈఓ, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కు సైతం నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను మే 7వ తేదీకి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!

టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ttd #thirupathi #highcourt #todaynews #flashnews #latestnews